ఔరంగాబాద్ లో యాక్సిడెంట్‌.. తెలంగాణ వాళ్లు నలుగురు మృతి

ప్రతి రోజు దేశంలో ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే మహారాష్ట్రలో జరిగిన కారు ప్రమాదం మరవక ముందే.. ఔరంగాబాద్ లో జరిగిన ప్రమాదంతో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మరణించిన వారు తెలంగాణా వాసులు కావటం, ఒకే కుటుంబం అవటంతో విషాదం నెలకొంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 24, 2023, 03:12 PM IST
ఔరంగాబాద్ లో యాక్సిడెంట్‌.. తెలంగాణ వాళ్లు నలుగురు మృతి

ప్రతి రోజు రహదారులు రక్తం ఒడ్డుతూనే ఉన్నాయి. దేశంలో ఏదో ఒక చోట యాక్సిడెంట్స్ జరగడం పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగడం చూస్తూనే ఉన్నా కూడా అదే తప్పిదాలతో యాక్సిడెంట్స్ కి గురి అవుతున్నారు. 
మహారాష్ట్రలో ఇటీవల కారు.. ట్రక్ ఢీ కొని పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగిన విషయం మరవక ముందే మరో యాక్సిడెంట్‌ ఔరంగాబాద్ లో జరిగింది. ఈ సంఘటనలో తెలంగాణకు చెందిన నలుగురు మృతి చెందారు.  

అంతకంటే విషాదకర వార్త ఏంటి అంటే మృతి చెందిన వారు అంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు.. అంతే కాకుండా వారు అంతా కూడా అన్నదమ్ములు అవ్వడంతో స్థానికంగా బందుమిత్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇలాంటి సంఘటనలు ముందు ముందు జరగకుండా ఉండాలని ఎంతగా కోరుకుంటున్నా ఏదో ఒక చోట ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి.

సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే... సిద్దిపేట జిల్లా చౌటపల్లికి చెందిన నలుగురు అన్నదమ్ములు ఎరుకుల కృష్ణ, సంజీవ్‌, సురేష్ మరియు వాసులు బందువుల అంత్యక్రియలకు వచ్చి సూరత్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ నలుగురు అన్నదమ్ములు కొన్ని సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం గుజరాత్ లోని సూరత్‌ కు వెళ్లారు. 

Also Read: Revanth Reddy: ఓఆర్ఆర్‌ను కేసీఆర్ పర్యవేక్షణలో తెగనమ్మారు.. మరో దోపిడీకి తెర: రేవంత్ రెడ్డి   

అక్కడ వీరు బాగానే సెటిల్ అయ్యారు. కుటుంబ సభ్యులు అంతా కూడా ఒక్క చోట ఉండాలనే ఉద్దేశ్యంతో నలుగురు కూడా సూరత్‌ లో కలిసి ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని స్థానికులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. 

అయిదు రోజుల క్రితం వీరి స్వగ్రామం అయిన చౌటపల్లి లో ఎరుకల రాములు మృతి చెందారు. అతడి అంత్యక్రియలకు హాజరు అయ్యేందుకు గాను కుటుంబ సభ్యులతో కలిసి చౌటపల్లికి వచ్చారు. భార్యలు మరియు ఇతర కుటుంబ సభ్యులను గ్రామంలోనే ఉంచి అన్నదమ్ములు నలుగురు సూరత్ కి మంగళవారం కారులో బయల్లేరారు. 

రాత్రి సమయంలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఫల్టీలు కొట్టింది. డ్రైవింగ్ లో ఉన్న వ్యక్తి నిద్ర పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అన్నదమ్ములు నలుగురు అక్కడికి అక్కడే మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కేసు నమోదు చేసిన పోలీసులు మృత దేహాలను చౌటపల్లి కి పంపించినట్లుగా తెలుస్తోంది.

Also Read: MS Dhoni IPL 2023 Ban: ఐపీఎల్ 2023 ఫైనల్‌కు ముందు చెన్నైకి భారీ షాక్‌.. ఎంఎస్ ధోనీపై నిషేధం!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News